గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 6న ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ బయటకి వచ్చేస్తే…
ఏ సినిమాకైనా డైరెక్టర్ హైప్ తెస్తాడు, హీరో హైప్ తెస్తాడు… లేదా ఈ ఇద్దరి కాంబినేషన్ హైప్ తెస్తుంది. ఈ మూడు కాకపోతే సినిమా ప్రమోషనల్ కంటెంట్ హైప్ తెస్తుంది. ఒక మంచి టీజర్, ట్రైలర్ ని కట్స్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇది ప్రతి సినిమా విషయంలో జరిగేదే అయితే ఈ లెక్కల్ని పూర్తిగా మార్చేస్తూ గుంటూరు కారం సినిమాకి కేవలం తన మాటలతోనే ప్రమోషన్స్ లో వేడెక్కిస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగ…
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ప్రకాష్ రాజ్… “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అనే డైలాగ్ చెప్తాడు. థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ గానే ఉన్నా ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో లేదు. మహేష్…
సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు, పూర్తిగా మాస్ సినిమా చెయ్యట్లేదు అనే కామెంట్స్ అభిమానుల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హిట్స్ కొట్టినా కూడా ఘట్టమనేని అభిమానులని మహేష్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, మహర్షి… ఈ సినిమాలు హిట్ అయ్యాయి, మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అయినా కూడా మాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. నిజానికి మహేష్…
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూనే…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత…
యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకూ.. ఆల్మోస్ట్ అందరితోను నటిస్తోంది శ్రీలీల. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీలీల నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్‌లో స్కంద సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన శ్రీలీల.. మంచి ఫ్లాప్‌నే ఫేస్ చేసింది. అయితే అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే ఒక సినిమాకి హైప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో మాత్రం హైప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటల్లో ఉంది. గుంటూరు కారం సినిమా…
గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో సెట్స్ పైకి వెళ్లిందో కానీ ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినా సరే వెంటనే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ బయటకి వచ్చేస్తుంది. గుంటూరు కారం సినిమాని కేవలం తన ప్రెస్ మీట్స్ తోనే ప్రమోట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై…