యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకూ.. ఆల్మోస్ట్ అందరితోను నటిస్తోంది శ్రీలీల. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీలీల నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్‌లో స్కంద సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన శ్రీలీల.. మంచి ఫ్లాప్‌నే ఫేస్ చేసింది. అయితే అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది. కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద, ఆదికేశవ సినిమాల కారణంగా శ్రీలీలకి రెండు నెలల్లో రెండు ఫ్లాప్స్ పడ్డాయి.
ఇక ఇప్పుడు డిసెంబర్ నెలలో నితిన్ సరసన నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా టాక్ పక్కన పెడితే.. ఇందులో శ్రీలీల క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆదికేశవ సినిమాలాగే శ్రీలీల పాత్ర తేలిపోయిందని అంటున్నారు. ఇలా అయితే శ్రీలీల కెరీర్ కష్టమనే అంటున్నారు. ఇంకొక్క ఫ్లాప్ పడితే శ్రీలీల మరో కృతిశెట్టి అయిపోయివడం గ్యారెంటీ అంటున్నారు. దీంతో ఇక సూపర్ స్టార్ మహేష్ బాబునే శ్రీలీలను కాపాడాలి అని అంటున్నారు. నెక్స్ట్ మంత్, అంటే జనవరి 12న ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేను పక్కకు తప్పించి మరీ శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశాడు త్రివిక్రమ్. ప్రస్తుతానికి ఈ సినిమా పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. లేదంటే శ్రీలీల కెరీర్లో కష్టాలు మొదలైనట్లే. ఏదేమైనా.. ఇప్పటికైనా కథల విషయంలో శ్రీలీల పంథా మారాల్సిందే.