Mahesh: క్రిటిక్ ప్రూఫ్… 50 డేస్ లో సూపర్ స్టార్ ని కాదు “సూపర్ స్ట్రామ్” ని చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే ఒక సినిమాకి హైప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో మాత్రం హైప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటల్లో ఉంది. గుంటూరు కారం సినిమా గురించి ఎప్పటికప్పుడు సూపర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు నాగ వంశీ. గతంలో సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ మా సినిమాకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పిన నాగ వంశీ, ఆ తర్వాత రిలీజ్ డేట్ విషయంలో కూడా వెనక్కి తగ్గేదే లేదు జనవరి 12న హ్యూజ్ సెలబ్రేషన్ కి రెడీగా ఉండండి అని తేల్చి చెప్పాడు. ఇటీవలే ఒక మీడియా ఇంట్రాక్షన్ మాట్లాడుతూ “రాజమౌళి సినిమా కలెక్షన్స్ రేంజులో గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయి” అంటూ ఘట్టమనేని అభిమానులకి ఒక్క మాటతో పూనకాలు తెప్పించాడు నాగ వంశీ.
ఇక ఇప్పుడు ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ… “గుంటూరు కారం సినిమాకి ఎలాంటి రివ్యూస్ ఇచ్చినా ఏం పర్లేదు. సినిమా సూపర్ హిట్ అవుతుంది” అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నాగ వంశీ మాటల్లో నిజముంది అనే విషయం మహేష్ ఫ్యాన్స్ కి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట లాంటి సినిమాలు యావరేజ్ రివ్యూస్ నే అందుకున్నాయి కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా కాకుండా అదిరిపోయేలా వచ్చాయి. అందుకే మహేష్ బాబు సినిమాలు క్రిటిక్ ప్రూఫ్ అనిపించుకుంటుంటాయి. ఇప్పుడు మహేష్ కి త్రివిక్రమ్ కూడా కలిసాడు కాబట్టి బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించేలా చేయడం గ్యారెంటీ. నేటి నుంచి సరిగ్గా 50 రోజుల్లో మహేష్ బాబు గుంటూరు కారం ఘాటుని బాక్సాఫీస్ కి రుచి చూపించబోతున్నాడు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!