Guntur Kaaram: ప్రతి సంక్రాంతికి అల్లుడొస్తాడు… ఈసారి మొగుడు వచ్చేలా ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ప్రకాష్ రాజ్… “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అనే డైలాగ్ చెప్తాడు. థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ గానే ఉన్నా ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో లేదు. మహేష్ లో గత కొంతకాలంగా మిస్ అవుతున్న మాస్ యాంగిల్ ని మళ్లీ పరిచయం చేస్తూ గుంటూరు కారం సినిమా బయటకి రాబోతుంది. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ గా కనిపించబోతున్నట్లు ఉన్నాడు. మాస్ అంటే రెగ్యులర్ మాస్ కాదు మహేష్ మాస్ ఇంకో రకం. పోకిరి, బిజినెస్ మాన్ సినిమాల్లో చూపించిన మాస్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో చూడబోతున్నాం.
మాస్ స్ట్రైక్ తో కాస్త శాంపిల్ చూపించిన మహేష్ అండ్ త్రివిక్రమ్… బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ తో ప్రమోషన్స్ హీట్ పెంచుతున్నారు. సైలెంట్ గా ఉన్నారే అనుకుంటున్న సమయంలో వయొలెంట్ టర్న్ తీసుకోని వెంటవెంటనే పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ని కంప్లీట్ గా ఖుషి చేస్తున్న కొత్త పోస్టర్స్ లో మహేష్ బాబు కత్తిలా ఉన్నాడు. లేటెస్ట్ గా ఈరోజు వదిలిన పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టుకోని నడుస్తుంటే… ఈ సీన్ కి థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే మైండ్ పోతుంది. మహేష్, శ్రీలీల ఉన్న ఈ కొత్త పోస్టర్ ని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. ఇదే జోష్ ని మేకర్స్ జనవరి 12 వరకూ మైంటైన్ చేస్తే చాలు రీజనల్ సినిమాలో ఉన్న అన్ని రికార్డ్స్ ని మహేష్ చెల్లాచెదురు చేయడం గ్యారెంటీ.
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?