గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో సెట్స్ పైకి వెళ్లిందో కానీ ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినా సరే వెంటనే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ బయటకి వచ్చేస్తుంది. గుంటూరు కారం సినిమాని కేవలం తన ప్రెస్ మీట్స్ తోనే ప్రమోట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవడానికి షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు బీడీ కాల్చేది బయటకి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అదే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి ఉంటే థియేటర్స్ టాప్ లేపే వాళ్లు. ఆ తర్వాత మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకోని ఉన్న ఫోటో లీక్ అయ్యింది. సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తే బ్లాస్ట్ చేసిన కార్స్ లీక్ అయ్యాయి. శ్రీలీలా-మహేష్ బాబు ఉన్న ఫోటో లీక్ అయ్యింది, పూజా హెగ్డే-మహేష్ బాబు షాపింగ్ మాల్ లో ఉన్న ఫోటో లీక్ అయ్యింది. ఇటీవలే ప్రకాష్ రాజ్ పాత్రకి సంబంధించిన లీక్… ఇలా గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పుడు షూటింగ్ జరిగినా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ ఈ లిస్టులో గుంటూరు కారం సాంగ్ కూడా వచ్చి చేరింది.
అఫీషియల్ గా రిలీజ్ కావాల్సిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్… సోషల్ మీడియాలో డైరెక్ట్ గా బయటకి వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది. ఇప్పటివరకు గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన అన్నింటికన్నా ఇది అతిపెద్ద లీక్. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ డాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుంటూరు కారం టైటిల్ సాంగ్ కి మహేష్ టేక్ కి ముందు డాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షూటింగ్ చూడడానికి వెళ్లిన మహేష్ అభిమానులే ఈ పని చేసి ఉంటారు. గుంటూరు కారం సినిమా విషయంలో ఒక్క సాంగ్ తప్ప మిగిలిన ప్రతి లీక్, మహేష్ ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ నుంచి లీక్ చేసినవే. ఘట్టమనేని ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్స్ కి వెళ్లినప్పుడు ముఖ్యమైన సీన్స్ కి సంబంధించిన ఫోటోలని, వీడియోలని లీక్ చేయకుండా ఉండాలి. అప్పుడే థియేటర్స్ లో ఆ సీన్ వచ్చినప్పుడు మజా ఉంటుంది. చిత్ర యూనిట్ కూడా ఈ లీకులని ఎందుకు ఆపలేకపోతున్నారో తెలియట్లేదు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోని గుంటూరు కారం లీకులని బయటకి రాకుండా ఆపుతారో లేదో చూడాలి.