ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయితే సైలెంట్ గా ఉంటారా? మోస్ట్ వయొలెంట్ అయిపోయి సోషల్ మీడియాని షేక్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తూ ప్రభాస్ అండ్ మహేష్ ఫ్యాన్స్ ‘X’లో హంగామా చేస్తున్నారు. ప్రభాస్, మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్… సలార్ నుంచి ఫస్ట్ సింగిల్, గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఈ రోజు రిలీజ్ అవనున్నాయని మేకర్స్ అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేశారు. దీంతో రెండు సినిమాల సాంగ్స్ ఏ టైమ్ లో బయటకి వస్తాయా అని మహేష్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ అవనుండగా.. .సలార్ నుంచి సూరీడే అనే సాంగ్ ఇంచు మించు అదే సమయంలో బయటకు రానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను ఓ ఆట అడేసుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియాని మేము సీజ్ చేస్తున్నాం అనే అంతగా #SalaarFirstSingle Trending with #OhMyBaby #MaheshBabu #Prabhas #GunturuKaaram ట్యాగ్స్ క్రియేట్ చేసి టాప్ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను కబ్జా చేసేశారు. సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుండగా… జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. అప్పటి వరకు ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్‌ను సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమే.