మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు త్రివిక్రమ్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ డిసెంబర్ 13న బయటకి రానుంది. ఇప్పటికే ఈ లిరికల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. “ఓ మై బేబీ’ అంటూ సాగనున్న ఈ సాంగ్ లో కొన్ని స్పెషల్ లిరిక్స్ ని త్రివిక్రమ్ రాస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
“ఓ మై బేబీ” పాటనే కాదు గుంటూరు కారం సినిమా నుంచి మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా బయటకి వచ్చిన ‘మాస్ స్ట్రైక్” వీడియోలోని లైన్స్ ని కూడా రాసింది త్రివిక్రమ్ అనే మాట ఉంది. “సన్న కర్ర.. సవ్వా దెబ్బ..! బొడ్డురాయి.. బేటా దెబ్బ..! రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!” అంటూ మాస్ స్ట్రిక్ కి లైన్స్ అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఓ మై బేబీ సాంగ్ కి ఎలాంటి స్పెషల్ లిరిక్స్ ని పెన్ డౌన్ చేసాడు… ఫుల్ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి త్రివిక్రమ్ ఎలాంటి టచ్ ని ఇచ్చాడో చూడాలి.