ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు.…
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ…