ప్రపంచంలో డెల్టా వేరియంట్ కొన్ని దేశాల్లో విజృంభిస్తున్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంనుంచి వచ్చే వారిపై కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఆసియాలోని గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త శాంతించింది. గల్ఫ్ లోని కొన్ని దేశాల్లో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో అమలులో ఉన్న ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారు. ఆంక్షలను సడలిస్తుండటంతో ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రెడీ అవుతున్నారు. యూఏఈ, సౌదీ అరెబియా, కువైట్ దేశాలకు పలు దేశాల నుంచి ఉపాది కోసం వేలాది మంది వెళ్తుంటారు. కరోనా పరిస్థుల కారణంగా చాలా మంది వెనక్కి వచ్చేశారు. అయితే, వీరంతా తిరిగి ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Read: అనాగరిక చర్య: వర్షం కోసం ఆ బాలికలను అలా…