గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
గుజరాత్ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ రోజువారీ కూలీ.. ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన రూపాయి నాణేలతో పది వేల డిపాజిట్ మొత్తం చెల్లించాడు.