ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో 'శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం' నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన…