GST Notice: కర్ణాటకలోని హవేరి జిల్లాకి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నాలుగేళ్లుగా చిన్న కూరగాయల షాపు నడుపుతున్న శంకర్‌గౌడ హడిమణి అనే వ్యాపారికి జీఎస్టీ అధికారులు ఏకంగా రూ. 29 లక్షల పన్ను నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుతో ఆయన సమస్యల్లో పడ్డారు. హవేరి మున్సిపల్ హై స్కూల్ వద్ద తన కూరగాయల షాపును నడుపుతున్న శంకర్‌గౌడ, రైతుల నుండి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి స్వయంగా…
స్వయం ఉపాధి కోసం కొందరు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. పెట్టిన పెట్టుబడిపోను ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తుంటారు. అయితే కూరగాయలు అమ్ముకునే ఓ విక్రేతకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. అతనికి జీఎస్టీ అధికారులు రూ. 29 లక్షల నోటీసు పంపారు. వస్తు, సేవల పన్ను నిబంధనల ప్రకారం ఈ భారీ చెల్లింపు చేయమని కోరారు. దీంతో అతడు షాక్ కి గురయ్యాడు. అతడు కర్ణాటకకు చెందిన శంకర్‌గౌడ హదిమణి. అసలు 29 లక్షల జీఎస్టీ నోటీస్ ఎందుకు…
Pani Puri: ‘‘పానీపూరీ’’ మనదేశంలో ప్రసిద్ధిమైన స్ట్రీట్‌ఫుడ్. పిల్లల నుంచి పెద్దల దాకా సాయంత్రం వేళల్లో పానీపూరీ బండ్లు కలకలలాడుతుంటాయి. ఇంత క్రేజ్ ఉన్న ఈ పానీపూరీ వ్యాపారం ద్వారా విక్రేతలు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజానికి పానీపూరీ లేదా గోల్‌గప్పా పేరు ఏదైనా కానీ, ఈ వ్యాపారం ఇతర ఉద్యోగాల కన్నా చాలా బెటర్ అంటూ సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్ తెగవచ్చాయి.
కేరళలోని తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది. చాలా సంవత్సరాలుగా భక్తులు స్వామివారిని విశ్వసిస్తూ.. దర్శించుకుంటున్నారు. తాజాగా ఈ టెంపుల్‌కి సంబంధించిన ఓ వార్తపై భక్తులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. అయితే.. రూ.1.57 కోట్ల జీఎస్టీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ నిర్వాహకులకు జీఎస్టీ విభాగం నోటీసు పంపింది. ఏడేళ్లుగా ఆలయంపై జీఎస్టీ బకాయి ఉందని నోటీసులో పేర్కొంది.
విద్యాశాఖకు జీఎస్టీ నోటీసులు ఇవ్వడంపై దుమారం రేపుతోంది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ-ఢిల్లీకి రూ.120 కోట్ల విలువైన జీఎస్‌టీ నోటీసు పంపించింది. 2017-2022 మధ్యకాలంలో ఐఐటీ-ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్‌లపై జీఎస్టీ నోటీసు వచ్చింది.
LIC GST Notice: గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి GST నుండి మరో నోటీసు అందింది. ఎల్‌ఐసికి అందిన ఈ నోటీసు డిమాండ్ నోటీసు, ఇందులో జిఎస్‌టి శాఖ రూ.663 కోట్ల డిమాండ్ చేసింది.
HUL GST Notice: దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) 2024 సంవత్సరం ప్రారంభంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది.
జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి.
GST Notices: జీఎస్టీ విభాగం ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ చెల్లించని కంపెనీలకు నిరంతరం నోటీసులు పంపబడుతున్నాయి. ఇటీవల జీఎస్టీ శాఖ పలు బీమా కంపెనీలకు నోటీసులు పంపింది.