GST Notice: కర్ణాటకలోని హవేరి జిల్లాకి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నాలుగేళ్లుగా చిన్న కూరగాయల షాపు నడుపుతున్న శంకర్‌గౌడ హడిమణి అనే వ్యాపారికి జీఎస్టీ అధికారులు ఏకంగా రూ. 29 లక్షల పన్ను నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుతో ఆయన సమస్యల్లో పడ్డారు. హవేరి మున్సిపల్ హై స్కూల్ వద్ద తన కూరగాయల షాపును నడుపుతున్న శంకర్‌గౌడ, రైతుల నుండి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి స్వయంగా విక్రయిస్తారు. ఈ మధ్య ఎక్కువ మంది కస్టమర్లు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.
Read Also:Viral Video: మరణం దరిదాపుల్లోకి వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన RPF కానిస్టేబుల్..!
ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులు శంకర్‌గౌడ అకౌంట్స్ ఆధారంగా నాలుగేళ్లలో రూ.1.63 కోట్లు విలువైన లావాదేవీలు జరిగాయని, అందువల్ల రూ.29 లక్షలు జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుందని ఆయనకు నోటీసు పంపారు. అయితే ఈ విషయమై తన వాదనను తెలిపాడు వ్యాపారి శంకర్‌గౌడ. నేను ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు చేస్తాను. నా దెగ్గర పక్కా రికార్డులున్నాయి. తాను నేరుగా రైతుల నుంచి తీసుకున్న కూరగాయలు విక్రయిస్తున్నాను. ఇవన్నీ ట్యాక్స్-ఫ్రీ సరుకులు. అటువంటి వాటిపై ఎలా జీఎస్టీ వేస్తారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని వాదన ఇలా ఉండగా..
Read Also:Gold Rate Today: అయ్యబాబోయ్.. బెంబేలేత్తిస్తున్న బంగారం ధరలు! కొనడం కష్టమే ఇగ
కూరగాయలు అమ్మిన లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతుండటంతో మొత్తం టర్నోవర్ పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, కర్ణాటక జీఎస్టీ శాఖ ప్రకటించిన ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం అయ్యే టర్నోవర్ దాటి పోయిన చిన్న వ్యాపారులపై నిఘా పెడతామన్నారు. దీనితో వారు నోటీసులు పంపించడం ప్రారంభించారు. ఈ దెబ్బతో ఇప్పుడు ఆ ప్రాంతంలో చాలా మంది చిన్న వ్యాపారులు యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్లు ఆపివేసి కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే, కేవలం క్యాష్ తీసుకుంటూ డిజిటల్ లావాదేవీలను తప్పించుకుంటున్నారని మాకు తెలిసిందని.. అయినా సరే, జీఎస్టీ అంటే మొత్తం టర్నోవర్‌పై పన్ను అని జీఎస్టీ శాఖ స్పష్టం చేసింది. నగదు లేదా యూపీఐ వేరు కాదు. ఎవరైనా ఆదాయాన్ని దాచే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం అని జీఎస్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.