Zomato Shares: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) డిమాండ్ నోటీసులు పంపించింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. 400 కోట్ల రూపాయల బకాయి పడినట్లు ఆ నోటీసులో జీఎస్టీ పేర్కొనింది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాలని డీజీజీఐ స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ఉదయం జొమాటో షేర్లు 4 శాతానికి పైగా పడిపోయాయి.
Read Also: VC Sajjanar: ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన ఆటోడ్రైవర్లు.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్
ఇక, షోకాజ్ నోటీసులపై జొమాటో రియాక్ట్ అయ్యారు. తమవైపు నుంచి ఎలాంటి పన్ను బకాయిలూ లేవని ఈ ఫుడ్ డెలివరి సంస్థ తెలిపింది. డెలివరీ భాగస్వాముల తరఫున తాము డెలివరీ ఛార్జీలు వసూలు చేశామని చెప్పింది. అలాగే కస్టమర్లకు తాము నేరుగా డెలివరీ సేవలు అందించలేం.. కాబట్టి, పరస్పర ఆమోదంతో కుదుర్చుకున్న నియమ నిబంధనల ప్రకారం డెలివరీ భాగస్వాములే ఆ సేవలను అందిస్తున్నారని వివరించింది.
Read Also: AP High Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులపై విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అయితే, జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలను పొందుపరిచాయి. అందులో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా, మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ.. సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి దీని నుంచి మినహాయింపు ఉండనుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్ ఫామ్ ఫీజుపై ఐదు శాతం పన్ను గురించి తెలియజేస్తుంది. ఈ ట్యాక్స్ ను జీఎస్టీ మండలి 2022 జనవరి నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. అలాగే, జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి. జీఎస్టీ బకాయిలతో ఫుడ్ ఆర్డర్‌ల ఛార్జీలను 2 నుంచి 3 రూపాయలకి స్విగ్గీ, జొమాటో ఆన్ లైన్ ఫుడ్ డెలివరి సంస్థలు పెంచాయి.