MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ…