తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. రాష్ట్రంలోని గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై హైకోర్టు మధ్యంతర తీర్పును సవాలు చేసిన కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేయకుండా నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి.
గ్రూప్-1 పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గ్రూప్-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ 4 వారాల పాటు నిలిపివేయాలని స్టే విధించింది.. రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.. కాగా, గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. ఇక, దీనిపై మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోపవాదలు జరగగా.. ఇరుపక్షాల వాదనలు విన్న…