రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విస్తృతమవుతుంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయి చేయి పట్టి మొక్కలు నాటిస్తుంది. ఇది ఒక ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా…
మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఆయన ఉసిరి మొక్కను నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్,అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి మొక్కలు నాటారు ఎంపీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. జపాన్ లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కోహన ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలిసి ఆరెంజ్,ఆలివ్,రోజ్ మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు తెలియజేసారు.హరిత ప్రపంచానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజ్‌గ్రూప్, నిర్వాణం & నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి.. జపాన్ లో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సోమవారం నాడు ‘ఎనిమీ’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మృణాళిని రవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హీరో విశాల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్, సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. ఇక విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో బాగంగా తమ నూతన చిత్రం మహాసముద్రం విడుదలను పురస్కరించుకొని ఈరోజు జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో మొక్కలు నాటిన మహాసముద్రం సినిమా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావ్, డైరెక్టర్ అజయ్ భూపతి, విలక్షణ నటుడు రావు రమేష్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా…
శంషాబాద్ మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి,…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రో.శాంతా సిన్హా . ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలి అని ఆకాక్షించారు. మానవాళికి చెట్లు ఎంతో అవసరం వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని గుర్తుచేశారు.ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని…