గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పూజా హెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విస్తృతమవుతుంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయి చేయి పట్టి మొక్కలు నాటిస్తుంది. ఇది ఒక ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతుంది.
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్” ను స్వీకరించిన తెలుగింటి బుట్టబొమ్మ పూజాహెగ్డే, ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటారు. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసురుతున్నట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజంపై బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!