దేశ రాజధాని ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వాడకంపై అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, పేల్చడానికి అనుమతి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
Supreme Court says No to Green crackers: దీపావళి వస్తుందంటే అందరూ ఎదురు చూసేది టపాసులు కాల్చడం కోసమే. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు టపాసులు కాల్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే వీటి వల్ల భారీగా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న ఢిల్లీలో టపాసులు కాల్చడం పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే…
దీపావళి పండుగ వచ్చేస్తోంది.. ఇంటిల్లిపాది కలిసి ఉత్సాహంగా టపాసులు కాల్చుతూ సంతోషంగా గడుపుతారు.. అయితే, రోజురోజుకీ పెరుగోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కోర్టులు, ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. దీపావళి రోజు పెద్ద ఎత్తున ధ్వని, వాయుష్య కాలుష్యం నమోదు అవుతుండడంతో.. కాలుష్య నియంత్రణ మండలి చర్యలను పూనుకుంది. ఇక, ఏపీలో దీపావళి పండుగ రోజు రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది……