పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం తన కిడ్నీని ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.
విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.