అక్కినేని నాగార్జున తాను హీరోగా నటించిన చిత్రాల ద్వారా, తాను నిర్మించిన సినిమాల ద్వారా పరిచయం చేసిన పలువురు దర్శకులు చిత్రసీమలో రాణించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నాగార్జున హీరోగా డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ‘సంతోషం’ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు. గ్రేసీ సింగ్, శ్రియ నాయికలుగా నటించిన ‘సంతోషం’ చిత్రం 2002 మే 9న విడుదలై మంచి విజయం సాధించింది. ‘సంతోషం’ కథలో ప్రేమతో పాటు, కుటుంబ విలువలూ మిళితమయ్యాయి. ధనవంతుడైన ఆర్కిటెక్ట్…