నేడు రాజ్‌భవన్‌కు ఏపీ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలవనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన స్థానిక సంస్థల నిధులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బీజేపీనేలు ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మాజీ ప్రధాని వాజపేయి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుపరిపాలన అంటే అటల్ బిహారీ వాజపేయి గుర్తుకొస్తారని అన్నారు. అటల్ జీవితం దేశ సేవకు అంకితమయ్యారన్నారు. అటల్ జీవితం బీజేపీ కార్యకర్తకు దిక్సూచిలాంటిదని తెలిపారు.
Also Read : Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్‌లు
పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన ధీరోధాత్తుడు అని కొనియాడారు. దేశం ఎదుర్కొన్న అతి పెద్ద బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. చాలా పిన్న వయస్సులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటి యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. స్థానిక సంస్థలకు కేంద్రం పంపించిన నిధులను రాష్ట్రప్రభుత్వం మళ్లించడాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడలో నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాన్ని బీజేపీ వాయిదా వేసుకుంది. గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ తర్వాత, నిరసన ఎప్పుడనేది పురంధేశ్వరి ప్రకటించనున్నారు.
Also Read : TS Govt : రాష్ట్రం లో 5500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో వున్న ప్రభుత్వం..?