తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్‌లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్‌కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదు.. ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి..?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్ లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. నిన్న సూర్యాపేటలో పట్టపగలే దారుణ హత్య జరిగిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేయబడినప్పటి నుండి భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయింది. అయితే మరోసారి దేశంలోని గనుల నుండి బంగారం బయటపడబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ మైనింగ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) పూర్తి సన్నాహాలు చేసింది. గనుల నుండి బంగారాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ సంస్థ సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. NMDC ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిగరగుంట-బిసనాథం గోల్డ్ బ్లాక్‌ను లీజుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
హనుమకొండ జిల్లాలో కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో పాటు కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయల పరిహారాన్ని నగర మేయర్ ప్రకటించారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అంటూ ఆయన అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలకులు ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసాతో కలిపి ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేస్తాం అని ఆయన వెల్లడించారు.