హనుమకొండ జిల్లాలో కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో పాటు కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయల పరిహారాన్ని నగర మేయర్ ప్రకటించారు.
Also Read : Ravi Shastri : టీమిండియాకు ధోనీని కెప్టెన్ చేయమని చెప్పింది నేనే..
చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయ్.. కుక్కలను చంపడం నేరం.. కానీ వాటి బర్త్ కంట్రోల్ చేస్తామని ఆయన హామి ఇచ్చారు. మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు.
కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ ను రప్పిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని యూపీలోని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్న మేయర్ గుండు సుధారాణి చెప్పుకొచ్చారు.
Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో టెర్రరిస్టులు.. ఆరుగురి అరెస్ట్..
ఇదిలా ఉంటే కుక్కల దాడిపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. బాలుడి డెడ్ బాడీని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తో పాటు ఇతర నాయకులు వెళ్లి పరిశీలించారు. కుక్కల నియంత్రణలో పాలకులు విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.