కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రైల్వే, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి వాటిల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాటిల్లో రైల్వే అప్రెంటిస్ రెక్రూట్‌మెంట్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్, జాతీయ దర్యాప్తు సంస్థలో నియామకాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. మరికొన్ని రోజులే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:Diwali Sales: వ్యాపార చరిత్రలో రికార్డ్.. దీపావళి వేళ దేశంలో రూ.6.05 లక్షల కోట్ల సేల్స్ నమోదు
రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025
తూర్పు మధ్య రైల్వే, ECR, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 1,149 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 25, 2025.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ 7000 పోస్టులకు
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 7,000 కి పైగా బోధనా, బోధనేతర ఉద్యోగాలను ప్రకటించారు. 10వ తరగతి నుండి మాస్టర్స్ డిగ్రీల వరకు అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వయోపరిమితి 18 నుండి 55 సంవత్సరాల వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 23, 2025, కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
Also Read:Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ తప్పులేదు.. తగిన చర్యలు తీసుకుంటాం!
జాతీయ దర్యాప్తు సంస్థలో నియామకాలు
భారత జాతీయ దర్యాప్తు సంస్థ డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నియామకాన్ని ప్రారంభించింది. హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in/en/national-investigation-agency-nia ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 25, 2025 లోపు NIA ప్రధాన కార్యాలయానికి ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు.