దేశంలో ఎక్కడైనా సరే.. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి రారు అనే అపవాదు నెలకొని ఉంది. అయితే ఉద్యోగులు సమయానికి రావాలి.. విధులు సక్రమంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వ బాధ్యతే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు సమయానికి ఆఫీసుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని సచివాలయ…
ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వులలో అధికారులు స్పష్టం చేశారు. ఏపీ భవన్, హైదరాబాద్‌లలో పనిచేసే…
ఏపీలో పీఆర్సీపై జారీ చేసిన కొత్త జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారని ఆయన తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయని, ఇది సానుకూల పరిణామం అన్నారు. పీఆర్సీ అమలు విషయంలో చర్చల పరంగా మరింత ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒకటి ఇక వర్తించదని… ఎందుకంటే ఇప్పటికే…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ…
కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో…
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది… అసలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో ఏముంది? ఫిట్‌మెంట్ 30 శాతం మార్క్ అయినా దాటుతుందా…? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు.. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, 11వ వేతన సంఘం ఇప్పటికే 23 శాతం సిఫార్సు చేసింది.. ఇక, కేంద్రం ఇస్తున్నట్లు 14 శాతం సిఫార్సు చేసింది సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. కానీ, కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అయినా వస్తుందని ఆశలు…
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం…