Employees Advance Salary: ప్రస్తుతం రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా దయతో వ్యవహరిస్తోంది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్, ప్రమోషన్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు మరో అద్భుతమైన కానుక అందించింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు అదే తరహాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచుతున్నాయి.
Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.…
Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం,…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2022 ఆగస్టు 1 నుంచి 2023 మార్చి 31 వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల…
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, రాష్ట్ర సచివాలయం, శాసన పరిషత్ ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలతో రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఉద్యోగుల…
మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9…
మహిళా ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఏపీలోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించి మంగళవార రాత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ మేరకు పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా…