వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ…
DK Aruna : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సమస్యలు చాయ్ తాగినంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన వారే ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం గద్వాలలో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ (SSA) ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె, వీరి డిమాండ్లకు పూర్తిగా మద్దతు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “సర్వశిక్షా అభియాన్…
Botsa Satyanarayana : విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి…