2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్‌టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో జీఎస్‌టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
READ MORE: Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
గత నెలతో పోలిస్తే.. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.16.34 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైంది. అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ సేకరణ 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు, మెరుగైన ఒప్పందాలు, వస్తువుల ఉత్పత్తి కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు ఇది రెండవ అత్యధిక వసూలుగా రికార్డు కెక్కింది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రభుత్వ ఖజానాలోకి రూ.21 లక్షల 51 వేల కోట్లు వచ్చాయి. కేవలం జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే.. రూ. 1.80 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూలు చేశారు.
READ MORE: December 31 Night: డిసెంబర్ 31 రాత్రి యువకుల ర్యాష్ డ్రైవింగ్.. రూ.90 లక్షల వసూళ్లు!
2024లో జీఎస్‌టీ వసూళ్లు.. నెలల వారీగా..
ఇదిలా ఉండగా.. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6084 కేసుల్లో సుమారు 2.01 లక్షల కోట్లు జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్‌లైన్ గేమింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్)తో పాటు ఇనుము, రాగి, తుక్కు వంటి ఖనిజాల విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని డీజీజీఐ వార్షిక నివేదికను వెలువరించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం 4872 కేసుల్లో 1.01 లక్షల కోట్ల ఎగవేతలను డీజీజీఐ గుర్తించగా.. ఆ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇందులో రూ.26,605 కోట్లు స్వచ్చందంగా వసూలైనట్లు డీజీజీఐ పేర్కొంది.