తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. అందులో భాగంగా.. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్‌పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ఈరోజు తెలిపారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు గిఫ్ట్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులపై నియమించిన అధికారులతో సమీక్షించారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలు భర్తీకి సిద్దమైనట్లు వెల్లడించారు.
మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల వారు ఆశలు పెట్టుకున్నారు. ప్రాముఖ్యంగా సీనియర్ సిటిజన్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపు విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను ఆదేశించారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (REMFS) కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ కొత్త సర్కులర్ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్కులర్ను సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములూ ఈ స్కీం సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందనున్నారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు…