Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త అందించింది. 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని వెల్లడించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం 1540 పోస్టులలో ఏఈఈ సివిల్…
Special Trains: తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఈ మేరకు సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 21, 28 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07481 తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. అటు ఈనెల 22, 29…
Wipro: ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఈ ఏడాది వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విప్రో ఖండించింది. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విప్రో స్పష్టం చేసింది. తాము తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అనుకున్న ప్రకారమే తమ ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తామని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును…
Good news to sanitation workers in andhra pradesh: పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పారిశుధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 233 ప్రభుత్వం విడుదల చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు మూలవేతనంగా రూ.15 వేలు అందుతోంది. ప్రస్తుతం హెల్త్ అలవెన్స్ కింద అదనంగా రూ.6వేలు…
జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖైదీలకు శిక్ష తగ్గించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మొత్తం శిక్షాకాలంలో సగానికి పైగా శిక్ష పూర్తి చేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మరణ శిక్ష, జీవిత ఖైదు పడిన వారికి, అత్యాచారం,…
బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పిక్‌ను ఆలియాభట్ షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పిక్‌లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్‌లో లవ్…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా మరో 995 పోస్టులు భర్తీ చేసేందుకు…
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు…
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని…
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు…