డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్ నుండి జరుగుతున్న బంగారు అక్రమ రవాణా సిండికేట్ ను బట్టబయలు చేశారు. ఈ ఫలితంగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.75 కోట్ల విలువైన 10.32 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా., డిఆర్ఐ అధికారులు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ…
ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పురీషనాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు.
బంగారం, మత్తు పదార్థలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీగా వీటిని పట్టుకుంటున్నా కూడా ముఠాలు ఆగడాలు తగ్గడం లేదు.. తాజాగా మరో ఆపరేషన్ లో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) యొక్క పూణే ప్రాంతీయ యూనిట్ బుధవారం పూణేలో ఒక మహిళా ప్రయాణీకురాలు ధరించే బెల్ట్‌లో బంగారు పేస్ట్ రూపంలో దాచిన రూ. 3.66 కోట్ల…
అధికారులు ఎన్ని కట్టుదిట్టమై చర్యలు తీసుకున్న బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న కేటుగాళ్లని చాకచక్యంగా పట్టుకుంటున్నారు అధికారులు.
పట్టుకోలేరు అనే ధీమాతో బంగారం అక్రమ రవాణాకు పాలపడుతున్నారు. చివరికి అధికారులకి చిక్కి జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
బెంగుళూరులో ఇద్దరు దుబాయ్ ప్రయాణీకులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు. ఆ బంగారపు బెల్టుని అక్రంగా రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Shamshabad Airport: ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ పలువురు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్‌లో వారి చావుతెలివి తేటలు చూసి అధికారులు సైతం షాక్‌కు గురవుతున్నారు.
Women Hides Huge Gold In Sanitary Pads in Mumbai: కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా.. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఏమాత్రం ఆగడం లేదు. బంగారంను అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ భలే తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించి.. కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. ఈ…
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారుల బృందం సీజ్ చేసింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లుగా మార్చి తరలించేందుకు ఓ కేటుగాడు ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా డీఆర్ఐ అధికారుల బృందం సూరత్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది. దుబాయ్ ప్రయాణీకుడి…