హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికుడు శుక్రవారం దుబాయ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715.800 గ్రాముల బంగారు వస్తువులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారాలను ఏమార్చడానికి కేటుగాడు తన వెంట తెచ్చుకున్న వస్తువుల లోపల బంగారు గొలుసులు మరియు పేస్ట్ రూపంలో…
స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు.…
బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా పట్టుబడుతోంది అక్రమ బంగారం. READ ALSO గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుని బంగారాన్ని విదేశాల నుండి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా…
బంగారం స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే టార్గెట్ గా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం సీజ్ చేశారు. కొలంబో ప్రయాణీకుల వద్ద 1.53 కోట్ల రూపాయల విలువ చేసే 3.1 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును…
బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఓ ప్రయాణికుడు సినిఫక్కిలో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసి కస్టమ్ అధికారులకు దొరికిపోయాడు. అబుదాబి నుంచి చైన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి సన్నటి వైర్లుగా తయారు చేసి లగేజ్ ట్రాలీ బ్యాగ్ సైడ్ లో వున్న రాడ్స్ లో అమర్చాడు. ఆ బంగారాన్ని దర్జాగా తరలించేందుకు ప్రయత్నించగా చైన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు చేసిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయట పడింది. దీంతో…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు. కెన్యా ప్రయాణికుడి వద్ద 75 లక్షల విలువ చేసే రెండు కేజీల బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా 7 బంగారు బిస్కట్ లను తను మోసుకొని వచ్చిన లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేసాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేయగా బయట పడ్డ అక్రమ ప్రయత్నం రవాణా చేస్తున్నాడు. దానిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు……
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో భారీగా 24 క్యారెట్ల 5 కేజీల బంగారం పెట్టుకున్నారు. దుబాయ్, మస్కట్ ప్రయాణీకుల వద్ద 5 కేజీలకు పైగా బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అయితే కస్టమ్స్ అధికారులే ఆశ్చర్య పోయే విధంగా బంగారంను వెరైటీ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. కేజీ బంగారాన్ని నోటిలో వున్న పళ్ళకు అతికించి దర్జాగా బయట చెక్కేసే ప్రయత్నం చేసారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో అక్రమ బంగారం గుట్టు బయటపడింది. మరో కేసు లో…