కార్తిక పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు శుభవార్త. పండుగ పూట ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా హెచ్చు తగ్గులుగా ఉంటున్న ధరలు.. ఈ వారంలో మాత్రం కాస్త ఉపశమనం కలిగించాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై మాత్రం రూ.500 తగ్గింది.
పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుతున్నాయి. సోమవారం మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. దీపావళికి ముందు జెట్‌స్పీడ్‌లో ధరలు దూసుకెళ్లాయి. ధరలు ఆకాశన్నంటడంతో బంగారం ప్రియులు లబోదిబో అన్నారు.
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు శాంతించిన ధరలు.. దీపావళి ముగియగానే తన పంథా కొనసాగిస్తోంది. మళ్లీ జెట్ స్పీ్డ్లా ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,080 పెరగగా.. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా మెరుపులు మెరిసిన బంగారం ధరలు దీపావళి రోజున కాస్త ఉపశమనం కలిగించింది. గోల్డ్, సిల్వర్ ధరలు నెమ్మదించాయి. తులం బంగారం ధరపై రూ. 170 తగ్గింది. సిల్వర్ ధర మాత్రం యధాస్థితిలో కొనసాగుతోంది.
Gold Price: విజయవాడ నగరంలో ధన త్రయోదశి ఎఫెక్ట్ కనిపించడం లేదు. బంగారం దుకాణాల దగ్గర రద్దీ కనిపించలేదు. గత ఏడాదితో పోలిస్తే 80 శాతానికి పైగా గోల్డ్ ధరలు పెరిగాయి.