దేశంలో ఇండిగో సంక్షోభం ఎలాగున్నా.. మంగళవారం పుత్తడి ధర మాత్రం దిగొచ్చింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పసిడి ప్రియులను తీవ్ర నిరాశ పరుస్తున్నాయి. ధరలు ఆకాశన్నంటడంతో గోల్డ్ లవర్స్ అయ్య.. బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. రోజుకోలాగా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఈరోజు మాత్రం తులం గోల్డ్‌పై రూ.330 తగ్గింది. సిల్వర్ ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.1,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Stock Market: ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.330 తగ్గి రూ.1,30,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 300 తగ్గి రూ.1,19,250 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 తగ్గి రూ.97,570 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్‌మెంట్..
ఇక వెండి ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.1,000 పెరిగింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,90, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,99,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,90, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Lowest Temperatures: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలి!