Gold Cheating: తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ కొందరు ఈ మధ్య మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసం చేయబోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ వారు నమ్మబలుకుతూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.…
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు. శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్.…