లోక్ సభకు తెలంగాణ వరదల రచ్చ తాకింది. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోతు వానలు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. దీంతో.. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. తెలుగురాష్ట్రాల్లో వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో.. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. అయితే.. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు…
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినా.. ఇంకా, పూర్తిస్థాయిలో తగ్గింది మాత్రం లేదు.. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 20.2 అడుగులుగా ఉందని.. వరద ప్రవాహం 23 లక్షల 30వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.. దీంతో, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.. గోదావరిలో ప్రస్తుత పరిస్థితిపై…
Bunny Vasu: ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు.
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్…
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకేరోజు అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోనుండగా.. గవర్నర్ రైలు మార్గంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఏపీలో గోదావరి నది పోటెత్తుతుండటంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు నీటి మునిగాయి. ఇప్పటికీ పలు గ్రామాలు నీటి ముంపులోనే ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వరద సహాయ, పునరావాస వ్యయం కింద జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ఉభయగోదావరి జిల్లాలకు చెరో 2 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం…
గోదావరి ఉప్పొంగడంతో గ్రామాల్లోని హ్యాండ్ పంపుల నుంచి ఉబికి ఉబికి వస్తోంది నీరు. చేతితో కొడితేనే సాధారణంగా నీరు వస్తుంది కానీ. ఇప్పుడు వర్షాలు, వరదల కారణంగా హ్యాండ్ పంపుల నుంచి ఏకధాటిగా నీరు వస్తోంది. గోదావరికి సమీపాన వున్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది.…