తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో గోదావరి పోటెత్తిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో వరదలతో అతలాకుతలం అవుతున్నారు.. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు.. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు నస్తపోయాయని లేఖలో పేర్కొన్న ఆయన.. వరద ప్రాంతాల్లో…
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెలిరి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ప్రాజెక్టు, చెరువులు నిండిపోయాయి. భారీ వానలకు మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. గోదావరి వరద…
గోదావరి వరద భయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులు బద్దలు కొట్టి మరీ దూసుకొస్తున్న వరద.. మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986 లో మేడిగడ్డ ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం,…
గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా. తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్ కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని..…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది.. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువైంది.. మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.. భద్రాచలానికి వెంటనే హెలికాప్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించండి అంటూ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో,…
గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. దీంతో.. అదేస్థాయిలో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది..…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది..…