భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి.. Read Also:…
ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
గోదావరి ప్రవాహం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉంది. గోదావరి వరద తగ్గుముఖం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
గత నెలలో గోదావరి ముంపు దెబ్బ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు.. అప్పుడే మళ్లీ గోదారమ్మ విరుచుకుపడుతుంది.. ఆగస్టులో వర్షాలు, వరదలు ఉంటాయని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నా.. కొన్ని పెళ్లిళ్లలకు ఇబ్బందులు తప్పలేదు.. ట్రాక్టర్లపై.. చివరకు పడవలపై మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు.. గోదారమ్మ ముంపే కాదు.. ముహూర్తాలు కూడా ముంచుకొస్తున్నాయి.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆ తంతు జరిపించడం లంక గ్రామాల వాసులకు సవాల్‌గా మారింది.. ఇళ్లు, గ్రామాలను…
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే…
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. మళ్లీ గోదావరిలో వరద పోటెత్తుతోంది.. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ఈ రాత్రికి గోదావరిలో వరద ప్రవాహం 50 అడుగులను కూడా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.. జులైలో భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమై.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రాంతాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది… ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ విపత్తలు నిర్వహణ సంస్థ.. ఆరు జిల్లాలను అప్రమత్తం చేసింది.. ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల…