టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Global Investment Summit: వాస్తవ పెట్టుబడుల కోసమే మా ప్రయత్నాలు.. కానీ, ప్రచార ఆర్భాటం, ప్రకటనల కోసం ప్రయత్నాలు చేయడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ లో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న “గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్” కు కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి హస్తినకు వచ్చినట్టు వెల్లడించారు.. ఈ సమ్మిట్ ద్వారా 13 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించామని తెలిపారు.. సంబంధిత కేంద్ర…