English Language: ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ రిపోర్ట్ వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ నిలిచింది.
Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించే విధంగా ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులు కావాలని నేటి యువత కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. యూఎన్ గ్లోబల్…
జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. సవరణలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే .. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పడేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాదిలో ప్రపంచ సూచీలో 135వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది అది కాస్త 127వ స్థానంలోకి వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా జూన్‌లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పెరిగాయి. ఇది గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూన్ ప్రారంభంలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ శాస్త్రవేత్తలు గురువారం ప్రపకటించారు.
ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)కు స్థానం దక్కింది.
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు…