చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికి పైగా మరణిస్తున్నారు. అమెరికాలోనే ఇప్పటివరకు 5.6 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచం మొత్తం మరణాల్లో ఆరింట ఒక వంతు అమెరికాలోనే నమోదవుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ ఉన్నాయి. కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత పలు దేశాలను ఆందోళన గురిచేస్తోంది. రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. పలు దేశాలలో జాన్సన్ అండ్ జాన్సన్, అస్ట్రాజెనెకా టీకాలపై తాత్కాలిక నిషేధం విధించారు.