New Delhi: జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. సవరణలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే .. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పడేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా రావడానికి కారణం కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను అమలు చేయడమే. సీపీఎస్‌ను వద్దని పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను అమలు చేయాలని దేశంలోని చాలా రాష్ట్రాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ పెన్షన్ స్కీమ్‌లో సవరణలకు కేంద్రం పూనుకుంది.
Read also: Komatireddy Venkatreddy: అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతాం
సీపీఎస్‌ను రద్దు చేయాలని.. ఓపీఎస్‌ను పునరుద్దరించాలని దేశంలోని ఎక్కువ రాష్ర్టాల ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటికే సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలు కూడా సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా జాతీయ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో సవరణకు ఒక కొత్త అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. దీంతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పారేసే అవకాశమున్నట్టు కేంద్రం భావిస్తోంది. గతంలో పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేసేవారు కాదు. అప్పటి ఎన్‌పీఎస్ ప్రకారం ఉద్యోగి చివరిసారిగా తీసుకున్న జీతంలో 50 శాతం రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్‌గా వచ్చేది. 2004లో అప్పటి సర్కార్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ను తెరపైకి తెచ్చింది. సీపీఎస్‌లో ఉద్యోగి మూలవేతనంలో 10 శాతం.. ప్రభుత్వం 14 శాతం వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం తాజా ఆలోచన ప్రకారం రిటైర్ అయ్యాక ఉద్యోగులకు నిర్థిష్ట మొత్తంలో పెన్షన్ అందేలా చూడడమే. ఇందుకోసం ఇప్పుడు వస్తున్న చివరి జీతంలో 38 శాతం దాకా పెన్షన్‌ను.. 40 నుంచి 45 శాతం దాకా పెంచాలని కేంద్రం ప్రతిపాదన. పాత పెన్షన్ విధానం మాదిరిగా 50 శాతం పెన్షన్ రాకున్నా 40 నుంచి 45 శాతం వరకు వచ్చేలా చూస్తే రిటైర్‌మెంట్ జీవితంలో ఉద్యోగికి అబ్ధి కలుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే అమలులోకి వస్తుంది. రాష్ట్రాల్లోని ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.