ఓ విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు స్కూల్ స్వీపర్. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. నలసోపరా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్‌లో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడైన స్కూల్ టీచర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అమిత్ దూబే (30)గా గుర్తించినట్లు తెలిపారు.
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిపై బిల్డర్ దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు..
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం లోచోటుచేస్తుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14) బాలికపై సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంఘటన స్థలంలోనే నిందితుడు కత్తి…