కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ 'చిర్రగోనె' ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.