ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే,…
క్రమంగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు సైతం హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.. అయితే, వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.. బయటకు వెళ్లే ఛార్జింగ్ సెంటర్లు పెద్దగా అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు.. దీంతో ఎలక్ట్రిక్ వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎక్కడికి వెళ్లినా.. ఛార్జింగ్ కిట్‌ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.. అంటే,…
హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్‌లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు…
వారికి వచ్చేదే అరకొర జీతం.. పైగా అది కూడా సమయానికి చేతికి అందదు.. మూడు మాసాల పెండింగ్.. తమకు జీతం పెంచాలని, దాన్ని సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నా స్పందన కరువు.. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కుటుంబాన్ని నెట్టుకురాలేక అనేక అవస్థలు.. ఇదీ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల దుస్థితి. ఈ నేపథ్యంలో జీతాల కోసం నగరంలోని జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి GHMC కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ…
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.…
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం…
వర్షాకాలంలో ప్రాణాపాయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ తో సహా ఉన్నతాధికారులు కొంత కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో గడువు దగ్గరపడుతుండటంతో..అధికారులు పనులను ముగించే పనులలో నిమగ్నమయ్యారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి…
వర్షం వచ్చందంటే చాలు హైదరాబాద్‌లో మురికి కాలువలు పొంగిపొర్లుతుంటాయి. దీంతో మురికి నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు జీహెచ్ఎంసీపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకుత్ పురా స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు…
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్‌ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ఖుషీగా వున్నారు. భాగ్యనగరంలో పేరుకుపోయిన ట్యాక్స్ ల వసూలుకు GHMC ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బంపర్ ఆఫర్ ముగిసింది. దీంతో GHMCకి కాసుల వర్షం కురిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ ఏప్రిల్ నెలలో కట్టిన వారికి 5 శాతం రిబేట్ సౌకర్యం కల్పించింది బల్దియా. దీంతో ఎగబడి మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశారు నగరవాసులు. ఈ ఆఫర్ కారణంగా జీహెచ్ఎంసీకి భారీగా…