ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనగానే రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు. వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన వారంతా.. తిరిగి వెళ్తూనే బోల్డన్ని కలలు కంటున్నారు. అందులో ప్రధానమైన స్వప్నం అసెంబ్లీలో అడుగుపెట్టడం. ఈ విషయంలో ఎవరికివారు ఊహాలోకంలో విహరించేస్తున్నారు. మీటింగ్స్‌లో పార్టీ పెద్దలు ఏం చెప్పారో.. వారి మాటలకు అర్థాలేంటో లోతైన అధ్యయనం చేయకుండానే కొత్త లెక్కలతో కుస్తీ పడుతున్నారట బీజేపీ కార్పొరేటర్లు. ప్రస్తుతం…
మేడమ్ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. మేయర్‌పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..! గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ..…
లంచాల విషయంలో ఆ ఆఫీసర్ రూటే సెప..రేటు. అన్ని అనుమతులు ఉన్నా.. చేతిలో బరువు పెట్టాల్సిందే. లేదంటే ఎక్కడో ఒకచోట కొర్రీలు పెట్టేస్తారట. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి సైతం ఝలక్ ఇచ్చారట ఆ అవినీతి ఆఫీసర్. ఉద్యోగవర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. అనుమతులున్న వెంచర్లనూ వదలని అధికారులు! హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఎన్నో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లు.. భూములు..…