ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్‌లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు.