Minister Komatireddy: ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి జాతర దగ్గర మెట్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా ప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆయన తెలిపారు. గూడులేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు నీడనిచ్చేలా కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
Read Also: Vemula Prashanth Reddy: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం..?
అలాగే, తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలను అమలు చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఈ తరుణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పథకాల అమలు జరగేలా ఆశీర్వదించమని అమ్మవారిని కోరుకోవడం జరిగింది.. ఎవరెన్ని మాటలు చెప్పిన తమ సర్కార్ పేదలకు అండగా ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.