గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ…